మాజీ అగ్నివీరులకు CISF, BSF, SSB లలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వివిధ ర్యాంకులలో భర్తీ చేసుకోనున్నామని BSF డైరెక్టర్ జనరల్ బుధవారం ప్రకటించారు. వయో సడలింపు కూడా ఉంటుందని వెల్లడించారు. నాలుగేళ్ల అనుభవం, శిక్షణ పొందిన అగ్ని వీరులు భద్రతా బలగాలకు ఆదర్శవంతమైన అభ్యర్థులు అవుతారని హోం మంత్రిత్వ శాఖ గుర్తించిన నేపథ్యంలో BSF ఈ కీలక నిర్ణయం తీసుకుంది.