రాజ్యసభలో 10 స్థానాలు ఖాళీ

77చూసినవారు
రాజ్యసభలో 10 స్థానాలు ఖాళీ
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ సభలో 10 స్థానాలు ఖాళీ అయినట్టు రాజ్యసభ సెక్రటేరియట్‌ అధికారికంగా వెల్లడించింది. 18వ లోక్‌సభకు ఎన్నికైన నేపథ్యంలో జూన్‌ 4 నుంచి వారి రాజ్యసభ సభ్యత్వం నిలిచిపోయినట్లు తెలిపింది. అసోం, బీహార్‌, మహారాష్ట్రల నుంచి రెండు చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్