కలుషిత నీరు తాగిన వంద మందికి అస్వస్థత

81చూసినవారు
కలుషిత నీరు తాగిన వంద మందికి అస్వస్థత
కలుషిత నీరు తాగి సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురైన ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగింది. ముగావ్ తండా గ్రామంలోని బావి నుంచి సరఫరా అయిన కలుషిత నీరు తాగి వీరు అనారోగ్యం పాలయ్యారు. 107 ఇళ్లు 440 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో జూన్‌ 26, 27న 93 మంది గ్రామస్తులు కడుపు నొప్పి, విరోచనాలతో బాధపడ్డారు. దీంతో 56 మందిని స్థానిక ఆరోగ్య కేంద్రంలో, మరో 37 మందిని పొరుగున ఉన్న మంజరం గ్రామంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్