కశ్మీరీ నేత షేక్ అబ్దుల్లా రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఉగ్రనిధుల కేసులో నిందితుడైన ఇంజినీర్ రషీద్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన జులై 25న పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేయనున్నారు.