AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ప్రేమ్ కుమార్ అనే ఏడాది బాలుడిని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. సోమవారం స్నానం చేయించేందుకు తల్లి నాగమణి ఆ బాలుడిని బయటకు తీసుకొచ్చింది. అయితే పనిమీద ఆమె తిరిగి ఇంట్లోకి వెళ్లగా అంతలోపే వచ్చిన కుక్కలు బాలుడిని లాక్కెళ్లి దాడి చేశాయి. గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా కాసేపటికే చనిపోయాడు. పెళ్లయిన 12ఏళ్లకు పుట్టిన కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం.