గుజరాత్‌లోని కచ్ జిల్లా లఖ్‌పత్ తాలూకాలో 12 మంది గుర్తు తెలియని జ్వరంతో చనియారు. ఈ ప్రాంతం పాక్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇటీవలే ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డాయి. చనిపోయిన వారిలో జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్యలు, బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని వైద్యులు చెబుతున్నారు. వారి నుంచి శాంపిళ్లను సేకరించామని, ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాతే వారి మరణానికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు.