తిహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ

78చూసినవారు
తిహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ
ఢిల్లీలోని తిహార్​ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌‌గా గుర్తించారు. తిహార్ జైలులో వందలాది మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకగా, 200 మంది ఖైదీలు సిఫిలిస్ లక్షణాలతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. తిహార్ జైలులో తిహార్, రోహిణి, మండోలి అనే మూడు జైళ్లు ఉన్నాయి. ఈ జైళ్లలోనే 125 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకినట్టుగా గుర్తించారు. తిహార్‌ జైల్లో దాదాపు 14,000 మంది ఖైదీలు ఉండగా, ఇందులో సుమారు 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్