అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి. జపాన్‌లో వడ్డీ రేట్ల పెంపు ప్రభావం పడింది. దీంతో మన సూచీలూ పతనమయ్యాయి. సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు ఆవిరై రూ.441.84 లక్షల కోట్లకు చేరింది. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో మదుపర్లు మొత్తంగా రూ.19.78 లక్షల కోట్ల విలువను కోల్పోయారు.