యూపీలోని ఖుషీనగర్ లో షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఓ ట్రక్కు ఇంజిన్‌లో భారీ కొండచిలువ తల దాచుకుంది. కార్మికులు లారీలోంచి రాళ్లను దించగా, కొండచిలువను గమనించి బానెట్‌ను తెరిచి బయటకు తీశారు. దీంతో అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం ఘటనా స్థలికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని అడవుల్లో వదులుతామని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.