దక్షిణ ఇథియోపియాలో సంభవించిన రెండు కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా 157కు పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు ఈ ప్రాంతంలో తరచుగా కొండ చరియలు విరిగిపడతాయని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.