TG: గ్యాస్ వ్యాపారం ముసుగులో ర్యాపిడో, ఓలా, ఊబర్ ద్వారా హెరాయిన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్ పీఎస్పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని190 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్స్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.