అస్సాం రాష్ట్రం సిల్చార్‌లోని బాలికల హాస్టల్ సమీపంలో ఇటీవల ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఏవో విచిత్ర శబ్ధాలు వస్తుండడంతో వెళ్లి చూడగా భారీ కొండచిలువ కనబడడంతో బాలికలు భయాందోళనకు గురై అక్కడున్న సిబ్బందికి చెప్పారు. వారు వెళ్లి చూడగా అది 100 కేజీల బరువు 17 అడుగుల పొడవు ఉంది. అయితే ఎలాగోలా పట్టుకొని దానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.