శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల

55చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 64,279 మంది దర్శించుకోగా.. 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్