కర్ణాటకలోని హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌తో 18 మంది విద్యార్థులకు అస్వస్థత

53చూసినవారు
కర్ణాటకలోని హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌తో 18 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్ణాటకలోని కోలార్ తాలూకా అమ్మనల్లూర్‌లోని ప్రీ-మెట్రిక్ హాస్టల్‌కు చెందిన 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారంగా దోసె, చట్నీ తిన్న తర్వాత వారికి అనారోగ్యం కలిగింది. బాధిత విద్యార్థులకు వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే అమ్మనల్లూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. వైద్యసేవలందించిన అనంతరం వారిని డిశ్చార్జి చేశారు.

ట్యాగ్స్ :