TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో దారుణ ఘటన జరిగింది. ఆక్కడి మంగళపల్లిలోని ఓ హాస్టల్లోకి ఒక వ్యక్తి చొరబడి బలవంతంగా 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులుఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అదే హాస్టల్ బిల్డింగ్ లో కింద ఉన్న ఒక రియల్ ఎస్టేట్ యజమాని వద్ద డ్రైవర్ పని చేస్తున్నట్లు సమాచారం. యువతి స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది.