కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 18వ తేదీన ఏపీకి చేరుకుంటారు. అదే రోజు రాత్రి సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. 19వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.