2.37 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం: కేటీఆర్‌

80చూసినవారు
2.37 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం: కేటీఆర్‌
ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులు యథేచ్ఛగా ఉల్లంఘించారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 'నాన్‌ లోకల్‌ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారు. అటెండర్‌ ఉద్యోగం నుంచి గ్రూప్‌-1 అధికారి వరకు 95 శాతం ఉద్యోగాలకు స్థానిక రిజర్వేషన్లు తెచ్చాం. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ యువతకు 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. కేసీఆర్‌ ప్రభుత్వం గత పదేళ్లలో 2.37లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది' అని న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్