22 విమానాలు దారి మళ్లింపు

579చూసినవారు
22 విమానాలు దారి మళ్లింపు
ఢిల్లీలో ప్రతికూల వాతావరణం వల్ల శనివారం 22 విమానాలను దారి మళ్లించారు. ఇందులో ఇండిగో (9), ఎయిర్ ఇండియా (8), విస్తారా (3) విమానాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. లక్నోకు 8, జైపూర్‌కు 9, చండీగఢ్‌కు 2, వారణాసి, అమృత్‌సర్, అహ్మదాబాద్‌లకు ఒక్కో విమానం చొప్పున దారి మళ్లించారు. ఢిల్లీలో రోజూ 1,300ల విమానాలు రాకపోకలు సాగిస్తాయి.

సంబంధిత పోస్ట్