ఒక్కో ఎమ్మెల్యేకు భాజపా రూ.25 కోట్ల ఆఫర్‌: కేజ్రీవాల్

66చూసినవారు
ఒక్కో ఎమ్మెల్యేకు భాజపా రూ.25 కోట్ల ఆఫర్‌: కేజ్రీవాల్
తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు బిజెపి నాయకులు ఆఫర్ చేసినట్లు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని శుక్రవారం ప్రవేశపెట్టడం జరిగింది. మద్యం కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసినందుకు ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. తప్పుడు కేసులు పెట్టడం, పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను కులగొట్టడం బిజీపీ నైజమని కేజ్రీవాల్ ఆరోపించారు. మా ఎమ్మెల్యేలు అంతా ఒక్కటిగా ఉన్నామని ప్రజలకు చూపించేందుకు నేను విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని కేజ్రీవాల్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్