ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా గాజాలో టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ మేరకు పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు. పలువురు ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఓ ఇంటిపైన కూడా దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు.