దేశవ్యాప్తంగా ఒక్క 2023 సంవత్సరంలోనే కుక్కకాటుతో 286 మంది మృతిచెందారని కేంద్రం వెల్లడించింది. మొత్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. అదే ఏడాది 4,65,498 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రేబిస్ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.