3.1 తీవ్రతతో ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం

82చూసినవారు
3.1 తీవ్రతతో ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం
ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం సంభవించింది. బిలాస్‌పూర్‌ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైందని నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. ఈ మేరకు భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.1గా నమోదైందని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్