అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. నేడు(సెప్టెంబర్ 4న) భూమి మీదుగా 3 భారీ గ్రహశకలాలు వెళ్తాయని హెచ్చరించింది. 120 అడుగుల వ్యాసంతో ఉన్న మొదటి గ్రహ శకలం '2024 QU' భూమికి 2.8 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. 36 అడుగుల వెడల్పు గల '2024 QE2' అనే రెండో గ్రహ శకలం 4,64,000 మైళ్ల దూరంలో ప్రయాణించనుంది. మూడోది '2024 RB'.. దాదాపు 35 అడుగుల వెడల్పు కలిగి 7,34,000 మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని తెలిపింది.