శుభకార్యాలకు 3 నెలలు బ్రేక్

593చూసినవారు
శుభకార్యాలకు 3 నెలలు బ్రేక్
నేటి నుంచి ఆగస్టు 4 వరకు 3 నెలలు శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి కారణంగా ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. సూర్యకాంతి గురు, శుక్ర గ్రహాలపై పడి ఈ మౌఢ్యమి సంక్రమిస్తుంది. ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం సాధ్యపడదని వివరించారు. ఈ కారణంగానే తిథులతో ముడిపడిన వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఏప్రిల్‌లో భారీగా జరిగాయి.

సంబంధిత పోస్ట్