పాకిస్థాన్‌లో వరదలకు 30 మంది మృతి

66చూసినవారు
పాకిస్థాన్‌లో వరదలకు 30 మంది మృతి
పాకిస్థాన్‌లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. 30 మందికిపైగా మరణించారని, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన లాహోర్ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ నాలుగు దశాబ్దాల రికార్డు బద్దలైందని, 44 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.