గాంధీభవన్‌ వద్ద 317 జీవో బాధితులు నిరసన (వీడియో)

59చూసినవారు
హైదరాబాద్‌ గాంధీభవన్‌ వద్ద 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జీవో 317పై కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

సంబంధిత పోస్ట్