మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13 శాతం పోలింగ్

52చూసినవారు
మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13 శాతం పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా, ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్