'ఇదేదో బాగుందే చెలి' సాంగ్ లిరిక్స్

3610చూసినవారు
'ఇదేదో బాగుందే చెలి' సాంగ్ లిరిక్స్
కాటుక కళ్ళను చూస్తే
పోతుందే మతి పోతుందే
చాటుగా నడుమును చూస్తే
పోతుందే మతి పోతుందే
ఘాటుగా పెదవులు చూస్తే
పోతుందే మతి పోతుందే
రాటుగా సొగసులు చూస్తే
పోతుందే మతి పోతుందే
లేట్ యూ గ ఇంతందాన్ని
చూసానా అనిపిస్తుందే
నా మనసే నీవైపోస్తుందే

ఇదేదో బాగుందే చెలి
ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలి
ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటే
నాకెంతో సరదాగుందే
ఆశను రేపెడుతుంటే
నాకెంతో సరదాగుందే
నిన్నిలా అల్లాడిస్తే
నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే
నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ
అందం అయ్యయ్యో అనుకుంటూనే
ఇలాగె ఇంకాసేప్అంటుందే
ఇదేదో బాగుందే మరి
ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి
ఇదే ప్రేమనుకుంటే సరి

తెలుసుకుంటావా తెలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్న ఎదుట నే ఉన్న
బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని
వేళా గొంతుల్లోన మోగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
చూసి చూడంగానే చెప్పిందే ప్రాణం
నేనీదాన్నై పోయానని
ఇదేదో బాగుందే చెలి
ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి
ఇదే ప్రేమనుకుంటే సరి

తరచి చూస్తూనే తరగదంటున్న
తళుకు వర్ణాల నీ మెనూ పూలగని
నలిగిపోతున్న వెలిగిపోతున్న
తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ
కంటి రేప్లు రెండు పెదవుల్లా మారి
నిన్నే తీనేస్తామన్నాయే
నేడో రేపో అని తప్పదు గ మరి
నీకోసం ఏదైనా సరే
ఇదేదో బాగుందే చెలి
ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి
ఇదే ప్రేమనుకుంటే సరి

సినిమా: మిర్చి
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
సింగర్: విజయ్ ప్రకాశ్, అనితా కార్తికేయన్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి

సంబంధిత పోస్ట్