విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

51చూసినవారు
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
TG: మహబూబ్‌బాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. వంతడపుల స్టేజీ గ్రామానికి చెందిన మహిళ ఆదివారం రాత్రి విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. కారం, పిండి పట్టే మిల్లును ముదిశెట్టి శైలజ (30) శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైనట్లు తల్లి జయమ్మ తెలిపారు. పక్కన ఉండే వారి సహాయంతో 108లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా శైలజ చనిపోయిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్