లల్లాయి లాయిరే లాయిరే….. ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే….. ఏ
లల్లాయి లాయిరే లాయిరే….. లాయ్
లల్లాయి లాయిరే లాయిరే….. ఏ
పల్లవి:
కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి
మాటలు అన్ని మరిచిపోయా నీళ్లే నమిలేసి
ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చేరా
వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చేరా
నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా
రాతిరంత నిదురపోని అల్లరే నీదిర
మొడుబారి పోయి ఉన్న అడవిలాంటి ఆశకేమో
ఒక్కసారి చిగురులొచ్చేరా
నా మనసే నీ వెనకే తిరిగినది
నీ మనసే నాకిమ్మని అడిగినది
లల్లాయి లాయిరే లాయిరే….. లాయ్
లల్లాయి లాయిరే లాయిరే…. ఏ
లల్లాయి లాయిరే లాయిరే…. లాయ్
లల్లాయి లాయిరే లాయిరే….. ఏ
చరణం:
గోపురాన వాలి ఉన్న పావురాయిల
ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కులా
నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగ
చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా
నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా
నువ్వు తప్ప ఎవ్వరొద్దు లేరా
నే ఉగ్గబట్టి ఉంచినా అగ్గి అగ్గి మంటనీ
బుగ్గ గిల్లి బుజ్జగించుకోర…..
నీ సూదిలాంటి చూపుతో దరమంటి నవ్వుతో
నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టర
నా నుదిటి మీద వెచ్చగా ముద్దు బొట్టు పెట్టారా
కుట్టి కుట్టి పోరా ఆ ఆ ఆ ఆ, కందిరీగ లాగా
చుట్టు చుట్టుకోరా……. ఆ ఆ ఆ ఆ, కొండచిలువ లాగా
నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా, వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా
నే వేడి వేడి విస్తరై, తీర్చుతాను ఆకలి, మూడు పూట్ల ఆరగించరయ్య
నా చేతి వేళ్ళ మెటికలు విరుచుకోర మెల్లగా, చీరకున్న మడతలే చక్కబెట్టార
నీ పిచ్చి పట్టుకుందిరా, వదిలిపెట్టనందిరా
నిన్ను గుచ్చుకుంటా…… ఆ ఆ ఆ…., నల్లపూసలాగా
అంటిపెట్టుకుంటా…… ఆ ఆ ఆ……, వెన్నుపూసలాగా
లల్లాయి లాయిరే లాయిరే….. ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే….. ఏ
లల్లాయి లాయిరే లాయిరే….. లాయ్
లల్లాయి లాయిరే లాయిరే….. ఏ
సినిమా: ఆకాశం నీ హద్దురా
సింగర్: ఢీ
లిరిక్స్: భాస్కరభట్ల
మ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్