'ఒకే ఒక మాట' సాంగ్ లిరిక్స్
By Mahesh 3703చూసినవారుఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ .. నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ
తల ఆంచి నీ గుండెపై
నా పేరు వింటాననీ .. నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ
నీకైన తెలుసా అనీ .. నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ .. నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
సినిమా: చక్రం
మ్యూజిక్: చక్రి
సింగర్: చక్రి
లిరిక్స్: సిరివెన్నెల సీతారామయ్య