హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతుల్లో తులసిని పూజిస్తే ఆర్థిక స్థితి మెరుగై, ఆరోగ్య సమస్యలు కూడా తొలగుతాయని నమ్మకం. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తులసి కోట కింద దీపం వెలిగించాలని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, తులసి మొక్క దగ్గర పిండితో చేసిన దీపాన్ని వెలిగించి ఆ మరుసటి రోజు దాన్ని ఆవుకు తినిపిస్తే ఆర్థిక సమస్యలు తొలుగుతాయని చెబుతున్నారు. ప్రతి రోజూ సూర్యోదయం కంటే ముందే తులసిని పూజిస్తే శుభ ఫలితాలుంటాయని స్పష్టం చేస్తున్నారు.