నేపాల్‌లో 4.0 తీవ్రతతో భూకంపం.. కూలిన పలు భవనాలు

79చూసినవారు
నేపాల్‌లో 4.0 తీవ్రతతో భూకంపం.. కూలిన పలు భవనాలు
భారత సరిహద్దు దేశమైన నేపాల్‌లో మంగళవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు NCS ఎక్స్‌ పోస్టులో పేర్కొంది. కాగా, ఈ భూప్రకంపనల కారణంగా పలు భవనాలు కూలిపోయాయి. ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్