ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం చుట్టు రక్షణగా 4 కి.మీ. ప్రహరీ గోడను నిర్మించాలని నిర్ణయించారు. ఇది 18 నెలల్లో పూర్తి కానుందని తెలిపారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా సోమవారం పనులను సమీక్షించారు. గోడను ఇంజనీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని, దాని ఎత్తు, మందం, డిజైన్ వంటి విషయాలను నిర్ణయించామని, మట్టి పరీక్షలు నిర్వహించాక పని ప్రారంభిస్తామని తెలిపారు.