ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. PBKS జట్టు స్టార్ పేసర్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ సీజన్‌లో మిగిలిన IPL మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఏప్రిల్ 12న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ మోకాలికి గాయమైంది. ఫెర్గూసన్ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 4 వారాల సమయం పట్టొచ్చని తేలడంతో అతడు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.