స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల RBI రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతంగా నిర్ణయించగా, దాన్ని అనుసరించి SBI కూడా వడ్డీ రేట్లలో తగ్గింపును అమలు చేయనుంది. కొత్తగా లోన్ తీసుకునే వారు కాకుండా, ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఏప్రిల్ 15 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.