TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఆ బిల్లుకు ఆమోదం తెలిపామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలకు శుభ సూచిక.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.