అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలల పాటు చిక్కుకున్న భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బుధవారం తిరిగి భూమి మీదకు రానున్నారు. ఆమెతో పాటు సహచర వ్యోమగామి బచ్ విల్మోర్ కూడా రానున్నారు. తెల్లవారుజామున 3.27 గంటలకు (భారత కాలమానం ప్రకారం) భూమికి చేరుకుంటారని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ప్రకటించింది. వీరి క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగుతుందని వివరించింది.