తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణమూర్తి కొత్త చిత్రం ‘యూనివర్సిటీ’ విశేషాలను సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నారాయణమూర్తిని సీఎం రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీరిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.