దేశంలోని 9వ తరగతి చదివే విద్యార్థులకు ఇస్రో గుడ్ న్యూస్ తెలిపింది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది చేపట్టబోయే ఈ కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది.