AP: కోనసీమ జిల్లా నెలపర్తిపాడులో దారుణం జరిగింది. తండ్రి పిల్లి రాజు తన పిల్లలు సందీప్, కారుణ్యలను కాలువలో తోసేశాడు. కారుణ్య గల్లంతవ్వగా.. కాలువ గట్టున ఉన్న తుప్పలను పట్టుకుని సందీప్ ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుణ్య మృతదేహాన్ని గుర్తించారు. నాన్న చంపొద్దని వేడుకున్నా కనికరించలేదని సందీప్ పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి పిల్లి రాజు కోసం గాలిస్తున్నారు.