మేధాపాట్కర్ కు 5 నెలల జైలుశిక్ష, జరిమానా

63చూసినవారు
మేధాపాట్కర్ కు 5 నెలల జైలుశిక్ష, జరిమానా
సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ 24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ఆమెకు 5 నెలల జైలుశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్మదా బచావో ఆందోళన సమయంలో ఆమె తనను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2002లో పరువునష్టం దావా వేశారు. తాజాగా కోర్టు ఆమెకు జైలుశిక్షతోపాటు.. సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్