కొన్నేళ్లలో ఏటా 50 లక్షల కార్ల విక్రయాలు: టాటా మోటార్స్

68చూసినవారు
కొన్నేళ్లలో ఏటా 50 లక్షల కార్ల విక్రయాలు: టాటా మోటార్స్
కొన్నేళ్లలో దేశీయంగా ప్రయాణికుల వాహనాల(పీవీ-కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) అమ్మకాలు ఏడాదికి 50 లక్షలకు మించడం సాధ్యపడతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. గతేడాది 41 లక్షల వాహనాలు అమ్ముడైన విషయాన్ని గుర్తు చేసింది. దేశంలో ప్రతి 1000 మందికి 30 వాహనాలు ఉన్నాయని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. అంతర్జాతీయ సగటు కంటే ఇది తక్కువని, వృద్ధికి అవకాశాలున్నాయన్నారు. దీనిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్