ఆంధ్రాలో 75 పెద్దపులులు

65చూసినవారు
ఆంధ్రాలో 75 పెద్దపులులు
AP: రాష్ట్రంలో పెద్ద పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్ట్‌ కింద పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం 2007లో ప్రకటించిన ప్రకారం ఆంధ్రాలోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల అటవీ ప్రాంతాలు టైగర్‌ రిజర్వ్‌ జోన్‌లో ఉన్నాయి. శేషాచలం, పాపికొండలు ప్రాంతంలోనూ పులుల జాడ కనిపించింది. ఏపీలో 2014లో 40 పులులు ఉండగా, 2023 నాటికి 75కు పెరిగాయి.

సంబంధిత పోస్ట్