ఆర్థిక మోసాల్లో 80% నకిలీ ట్రేడింగ్‌ సొమ్ములే!

50చూసినవారు
ఆర్థిక మోసాల్లో 80% నకిలీ ట్రేడింగ్‌ సొమ్ములే!
గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన సైబర్‌ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40% పైగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు సంబంధించి 7.4 లక్షల కేసుల్లో బాధితులు రూ.1,770 కోట్లు పోగొట్టుకున్నట్లు ఐ4సీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాటిల్లో నకిలీ ట్రేడింగ్‌కు సంబంధించి కేవలం 20,043 కేసులే నమోదైనా ఏకంగా రూ.1420.48 కోట్లను ముఠాలు కొల్లగొట్టాయి. దీనిబట్టి ఈ నేరాల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్