సీనియర్ నటి పావలా శ్యామలా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను దీన స్థితిలో, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. '50 ఏళ్లుగా సినీ ఆర్టిస్టుగా బతికాను.. మూడేళ్ల నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నా. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. పెద్ద హీరోలతో చేసి ఇప్పుడు విషం తాగి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నా. అనాథగా చంపేస్తారా?' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.