TG: 2024 సంవత్సరంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ 32 శాతం పెరిగిందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. అలాగే 805 రోడ్డు ప్రమాదాలలో 842 మంది మృతి చెందారని తెలిపారు. సైబర్ క్రైమ్ 32 శాతం పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్‌లో 11914 కేసులకు గాను రూ.70 కోట్ల అమౌంట్ రికవరీ అయ్యిందన్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ 421 కేసుల్లో 24 కోట్ల 92 లక్షల విలువ చేసే మత్తుపదార్ధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.