TG: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి ZP పాఠశాలలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. సీఎం కప్ పోటీల్లో భాగంగా ఉదయం వాలీబాల్ ఆడుతూ సాయి పునీత్(15) అనే టెన్త్ క్లాస్ విద్యార్థి కళ్లుతిరిగి పడిపోయాడు. సాయంత్రం 4 గంటల సమయంలోనూ వాలీబాల్ ఆడుతూ మరోసారి కుప్పకూలాడు. పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.