ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. 372 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన టీమిండియా 249 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ 54, మిన్ను మణి 46, జెమీమా 43, హర్మన్‌ప్రీత్ కౌర్ 38 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆనా బెల్ 4 వికెట్లు, మెగాన్, కిమ్ గార్త్, గార్డ్‌నర్, సోఫీ, అలానా కింగ్ తలో వికెట్ పడగొట్టారు. 3 వన్డేల సిరీస్‌లో 2 మ్యాచ్‌లు ఓడిన భారత్ సిరీస్‌ను కోల్పోయింది.