జయరామ్ తనయుడు, నటుడు కాళిదాస్ ఓ ఇంటివాడయ్యారు. మోడల్ తరిణిని ప్రేమించిన నటుడు పెళ్లికి పెద్దలను ఒప్పించారు. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఆదివారం ఉదయం సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేశ్‌గోపి దంపతులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలను కాళిదాస్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.